కోల్కతా: బెంగాల్లోని కోల్కతాలో ఉన్న జాదవ్పుర్ యూనివర్సిటీ(Jadavpur University)లో ఓ విద్యార్థి హాస్టల్ భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో ఆదివారం ఇద్దరు సీనియర్లను అరెస్టు చేశారు. అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థి స్వప్నదీప్ కండును సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వేధింపులు తట్టుకోలేక అతను హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వప్నదీప్ స్వలింగ సంపర్కుడంటూ సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఎకనామిక్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థితో పాటు సోసియాలజీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో గత శుక్రవారం మరో సీనియర్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.