December 21 | నేడు డిసెంబర్ 21 (December 21).. ప్రస్తుతం ఈ డేట్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఎందుకంటే ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు అంట. ఆకాశంలో అద్భుతం జరగబోతోందని అంటున్నారు. ఆ అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి..? 24 గంటలు అని అందరికీ తెలుసు. అందులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. ఉదయం 6 గంటలు సూర్యుడు ఉదయిస్తే.. సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తాడు. ఇక శీతాకాలంలో మాత్రం ఇందులో కాస్త మార్పులు ఉంటాయి. పగటిపూట తక్కువగా.. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు తొందరగా అస్తమించి చీకట్లు కమ్మేస్తుంటాయి. సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను అయానంతం సోల్స్టీస్ అంటారు.
అయితే, ఇవాళ సాధారణ రోజుల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉండనుంది (shortest day). తొందరగా చీకటి పడుతుందంట. దాదాపు 16 గంటలపాటూ రాత్రిని చూడబోతున్నామంట. ఇవాళ అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇలా ఏటా రెండుసార్లు జరుగుతుంది.
శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. దీంతో శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలురకాల నమ్మకాలను పాటిస్తుంటారు.
చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాల్లో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలోని ప్రజలు శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.
Also Read..
Forest Cover: మూడేళ్లలో 1445 చ. కిమీ పెరిగిన అటవీ విస్తీర్ణం
Virat Kohli | కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌కు నోటీసులు.. 7 రోజుల్లో స్పందన లేకపోతే చట్టపరమైన చర్యలు