న్యూఢిల్లీ: అన్ని రకాల వస్తువుల ప్యాకెట్లపైనా జనవరి 1 నుంచి తప్పనిసరిగా మాన్యుఫ్యాక్చరింగ్ డేట్, యూని ట్ సేల్ ప్రైస్ ను ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్‌సింగ్ సోమవారం ఆదేశించారు. ఇప్పటివరకు ప్యాకేజ్డ్ కమాడిటీస్పై మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ లేదా దిగుమతి చేసుకున్న తేదీ లేదా ప్యాకేజింగ్ తేదీల్లో ఏదో ఒకటి ముద్రిస్తే సరిపోయేది. తాజా నోటిఫికేషన్ ప్రకారం వస్తువు తయారుచేసిన తేదీని తప్పనిసరిగా ము ద్రించాలి. దాంతోపాటు యూనిట్ సేల్ ప్రైస్‌ను కూడా ముద్రించడం తప్పనిసరి. ప్యాకే జ్డ్ ఐటమ్స్‌ను వేర్వేరు పరిమాణాల్లో అమ్ముతారు కాబట్టి, యూనిట్ సేల్ ప్రైస్ ను వినియోగదారులు తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. కేజీ కన్నా తక్కువ పరిమాణం గల ప్యాకెట్‌పై ఒక గ్రాము అమ్మకం ధరను, ఆ ప్యాకెట్ గరిష్ఠ చిల్లర ధరని ముద్రించాలన్నారు.