రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం అబద్ధం: శరద్ పవార్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. 300 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రశాంత్ కిషోర్ తనను రెండుసార్లు కలిసినట్లు శరద్ పవార్ తెలిపారు. అయితే ఆయన సంస్థ గురించి మాత్రమే తాము మాట్లాడుకున్నామని అన్నారు. ఎన్నికల వ్యూహాలను రూపొందించే రంగాన్ని విడిచిపెట్టినట్లు ప్రశాంత్ కిషోర్ తనతో చెప్పారన్నారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు లేదా రాష్ట్రపతి ఎన్నికలకు నాయకత్వం గురించి ప్రశాంత్ కిషోర్‌తో ఎలాంటి చర్చ జరుగలేదని శరద్ పవార్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదని, వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 2024 ఎన్నికలకు ఏ నాయకత్వం వహించబోనన్న ఆయన, అప్పటి పరిస్థితుల మేరకు రాజకీయాలు మారవచ్చని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

