బెంగుళూరు: అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు గగన్‌యాన్ ప్రాజెక్టును ఇస్రో(ISRO) చేపడుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే జూలై 3వ తేదీన మహేంద్రగిరిలో ఉన్న ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో స్పేస్ ఏజెన్సీకి చెందిన సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్సన్ సిస్టమ్‌లో రెండు పరీక్షలు నిర్వహించారు. ఒకటి స్వల్ప కాల వ్యవధి 30 సెకన్లు పాటు కాగా మరొకటి 100 సెకన్ల పాటు ప్రొపల్సన్ పరీక్షలు చేపట్టారు. హాట్ టెస్ట్‌లు నిర్వహిస్తున్న సమయంలో ప్రొపల్సన్ సిస్టమ్ సాధారణ స్థాయిలో పర్ఫార్మ్ చేశాయి.
100 సెకన్ల పరీక్ష సమయంలో.. రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ త్రస్టర్స్తో పాటు వేర్వేరు దశల్లో లిక్విడ్ అపోజి మోటార్ ఇంజిన్లు సక్రమంగా పనిచేశాయి. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఇప్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్ సెంటర్ .. టెక్నాలజీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసుకుంటున్నది. గగన్‌యాన్ ఆర్బిటాల్ మాడ్యూల్లో ఎస్‌ఎంపీఎస్ విధానం కీలకం కానున్నది.
ఆర్బిటాల్ మాన్యువోరింగ్ సమయంలో ఎస్‌ఎంపీఎస్ తప్పనిసరి అవుతుందని ఇస్రో పేర్కొన్నది. అయిదు లిక్విడ్ అపోజీ మోటారు ఇంజిన్స్, 16 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లు ఉంటాయి.