న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ‘యాక్సియం-4’ మిషన్ ప్రయోగం చేపడుతున్నట్టు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ వద్ద నుంచి చేపడుతున్న ఈ మిషన్.. సాంకేతిక కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది.
ఈ మిషన్ ద్వారా..శుభాన్షు శుక్లా సహా పోలండ్, హంగేరీ, అమెరికాకు చెందిన మొత్తం నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకొని కీలక ప్రయోగాలు చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం రాకెట్ ప్రయోగాన్ని 29నే చేపట్టాల్సి ఉంది. అయితే అది జూన్ 8కి, ఆ తరువాత 11కి వాయిదా పడింది.