బెంగళూరు, డిసెంబర్ 12: అంతరిక్ష ప్రయోగాల్లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీలక మైలురాయిని అధిగమించింది. నవంబర్ 29న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ సీ-లెవల్ హాట్ టెస్టును విజయవతంగా జరిపినట్టు ఇస్రో వెల్లడించింది.
అంతరిక్షంలో వ్యోమనౌక మళ్లీ స్టార్ట్ కావడానికి కీలకమైన మల్టీ-ఎలిమెంట్ ఇగ్నైటర్ సామర్థ్యాన్ని పరీక్షించినట్టు తెలిపింది. సీ-లెవెల్ పరీక్షలో సాధారణంగా ఉండే వైబ్రేషన్, ఉష్ణ ఒత్తిడి వంటి సమస్యలకు పరిష్కారం నాజిల్ ప్రొటెక్షన్ వ్యవస్థను కూడా ఈ ఇంజిన్‌కు జత చేసినట్టు పేర్కొన్నది. ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ మానవ వ్యోమనౌక ప్రాజెక్టులో ఇది కీలకపాత్ర పోషించనున్నట్టు తెలిపింది.