Bengaluru | బెంగళూరు: కన్నడ భాష ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కన్నడ నేర్చుకునేందుకు ఇష్టపడనివారికి బెంగళూరు దారులు మూసుకుపోయాయని ఓ యూజర్ ఎక్స్‌లో చేసిన పోస్టు తాజాగా వైరలైంది.
‘కన్నడ భాష నేర్చుకోవడానికి ఇష్టపడని ఉత్తరాదివారు, పొరుగు రాష్ర్టాల ప్రజలకు బెంగళూరు దారులు మూసుకుపోయాయి’ అని బబ్రువాహన అనే యూజర్ చేసిన ట్వీట్ నెట్టింట చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా కన్నడ, కన్నడేతరుల మధ్య అగ్గి రాజేసింది.