IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) 1990 బ్యాచ్ అధికారి సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నెల 8న ఆమోదించింది. ఆయనకు రూ.1.80లక్షల నుంచి రూ.3.20లక్షల పే స్కేల్ ప్రాతిపదికన సంజయ్‌కుమార్ జైన్ జరిగిందని ఐఆర్సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
ఆయన డిసెంబర్ 31, 2026 వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.. ఇందులో ఏది ముందైతే అప్పటి వరకు పదవిలో కొనసాగనున్నారు. ఇంతకు ముందు ఆయన ఉత్తర రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. అయితే, మహేంద్ర ప్రతాప్ మాల్ పదవీ విరమణ తర్వాత ఐఆర్సీటీసీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడం గమనార్హం. జనవరి 2021 నుంచి పోస్టు ఖాళీగా ఉంటూ వస్తుండగా.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు సంజయ్‌కుమార్ జైన్ చైర్మన్‌గా నియామకమయ్యారు.