న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: రైల్వేలో నకిలీ, ట్యాంపర్డ్ అన్రిజర్వ్డ్ టిక్కెట్లను కనిపెట్టడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)లు వీటి సహాయంతో నకిలీ టిక్కెట్లను ఇట్టే పట్టేస్తారు. ఈ టీటీఈ ఆండ్రాయిడ్ యాప్ సహాయంతో అన్ రిజర్వ్డ్ టిక్కెట్ విధానంలో జారీ చేసినవి సక్రమమైనవా, అక్రమమైనవా అని పరిశీలించవచ్చు.
దీని కోసం టీటీఈలందరికీ హెచ్ఎంటీ మిషన్లను అందజేశారు. టిక్కెట్‌పై ఉన్న యూటీఎస్ నెంబర్ నమోదు చేయడం ద్వారా అది అసలుదా, నకిలీదా అన్నది వీరు కనిపెట్టేస్తారు. అలాగే ఈ యాప్ ద్వారా టికెట్‌పై ముద్రించి ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.