న్యూఢిల్లీ: భారతీయ రైల్వే తత్కాల్, ఈ-టికెటింగ్ సేవలు గురువారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లు పనిచేయకపోవడంతో, క్రిస్మస్ సెలవుల్లో రైల్వే ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
నిర్వహణపరమైన పనులు చేపట్టడంతో టికెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని సంస్థ వెల్లడించింది. కాసేపటి తర్వాత ఐఆర్సీటీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.