న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: బీఎస్ఎఫ్ అదనపు డీజీగా ఉన్న ఐపీఎస్ అధికారి అనురాగ్ గార్గ్.. ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ (ఎన్సీబీ) నూతన డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. కేంద్ర హోంశాఖ మంగళవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. 2026 మే 23 వరకు లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్సీబీ డీజీగా కొనసాగుతారని కేంద్రం పేర్కొన్నది.