న్యూఢిల్లీ, జూలై 17: యాపిల్ ఐఫోన్ కొంటే మన డాటాను కాపాడుతుందని మాత్రమే తెలుసు. కాకపోతే మనుషుల ప్రాణాలే కాపాడుతుందని తెలుసా? ఓ సైనికుడిపై దుండగులు కాల్పులు జరిపారు. అయితే తన జేబులో ఉన్న ఐఫోన్‌కు ఆ బుల్లెట్ తాకింది. అయితే ఆ ఫోన్ ఉండటం వల్లే అతడి ప్రాణాలు కాపాడుకోగలిగాడని పలువురు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నది.