iPhone explodes | జేబులోంచి బయటికి తీస్తుండగానే పేలిపోయిన ఐఫోన్..!
iPhone explodes | సాధారణంగా నాసికరం మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్సంగ్ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది.
అలీగఢ్: సాధారణంగా నాసికరం మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్సంగ్ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది. జేబులోంచి పొగలు వచ్చేది గమనించిన ఓ వ్యక్తి.. ఆ జేబులో ఉన్న ఐఫోన్‌ను బయటికి తీస్తుండగానే అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అలీగఢ్‌కు చెందిన ప్రేమ్ రాజ్ సింగ్ (47) ఒక వ్యాపారి. ఆయన తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించాడు. ఏం జరిగిందో చూద్దామని వెంటనే దాన్ని బయటికి తీస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ప్రేమ్ రాజ్ బొటన వేలికి, తొడకు స్వల్ప గాయాలయ్యాయి.
ఐఫోన్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనిపై ప్రేమ్ రాజ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

