న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల యోగేశ్ కద్యాన్కు ఇంటర్‌పోల్(Interpol) రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. అతనిపై నేరపూరిత కుట్ర, హత్యాయత్నాల ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం అతను అమెరికాకు వెళ్లాడు. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న బాబినా గ్యాంగ్‌లో ప్రస్తుతం అతను పనిచేస్తున్నాడు. ఆయుధాలు వాడడంలో అతను సిద్ధహస్తుడని అధికారులు చెప్పారు. 17 ఏళ్ల వయసులో యోగేశ్.. అమెరికాకు నకిలీ పాస్‌పోర్టుపై వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాంబినా గ్యాంగ్‌తో పాటు ఖలిస్తానీ ఉగ్రవాదులతోనూ అతనికి లింకులు ఉన్నాయి. యోగేశ్ తలపై 1.5 లక్షల రివార్డు ఉంది. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. గతంలో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు గురించి కూడా ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.