న్యూఢిల్లీ: గత నెలలో 288 మంది మృతి చెందిన ఒడిశా రైలు ప్రమాదానికి పాయింట్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్లో లోపాలే కారణమని ప్రకటించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేడు పార్లమెంట్ సాక్షిగా రైల్వే ఇంటర్ లాకింగ్ గత ఏడాది కాలంగా ఎప్పుడూ వైఫల్యం చెందలేదంటూ బూటకపు ప్రకటన చేశారు.
దేశంలో గత ఏడాది కాలంగా రైల్వే ఇంటర్ లాకింగ్ సిగ్నల్ విధానం ఎప్పుడూ వైఫల్యం చెందలేదని, సిగ్నలింగ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు నవీకరిస్తుండటంతో ప్రయాణికుల భద్రత, నిర్వహణలో భారత రైల్వే శాఖ గొప్ప మైలురాయికి చేరుకుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.