భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సైన్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను చెప్పా పెట్టకుండా ఫేస్బుక్ యాజమాన్యం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఫేస్బుక్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఫేస్బుక్ అకౌంట్‌ను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు. చినార్ కార్ప్స్ అధికారులు ఫేస్బుక్ టెక్నికల్ టీమ్‌తో ఈమెయిల్ ద్వారా చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను పునరుద్ధరించారు. ఫేస్బుక్ అకౌంట్‌ను మాత్రం అతి త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. తమ రూల్స్‌కు విరుద్ధంగా కొన్ని పోస్టులున్నాయని, అందుకే బ్లాక్ చేసినట్లు ఫేస్బుక్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.