ముంబై: ఫోర్త్ స్కార్పీన్ క్లాస్‌కు చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వెలాను ఇవాళ జలప్రవేశం చేశారు. ముంబై డాక్యార్ట్లో ఈ కార్యక్రమం జరిగింది. నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ వెలా జలాంతర్గామి సామర్థ్యం విస్తృతమైందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో భద్రతా అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే, వెలా సామర్థ్యం, పనితనం నేవీకి అదనపు బలాన్ని ఇస్తుందన్నారు. భారతీయ తీర ప్రాంతాన్ని ఇది రక్షించగలదని ఆయన అన్నారు. భారత జలాల్లోకి ఐఎన్ఎస్ వెలా సబ్‌మెరైన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. నేవీ చీఫ్ కరంబీర్ దాని గురించి వివరించారు. ప్రాజెక్టు-75 వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఐఎన్ఎస్ వెలా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇండియా, ఫ్రాన్స్ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
2022 ఆగస్టులో విక్రాంత్ జలప్రవేశం..
కోవిడ్ మహమ్మారి వేళ ఎదురైన సవాళ్లు చాలా కఠినమైనవని, ఇదే సమయంలో ఎల్ఏసీ వద్ద ఉన్న ఉద్రిక్తతలను ఎదుర్కొన్న తీరు కూడా అత్యంత కఠినమైనవన్నారు. నౌకల్లో ఫిజికల్ డిస్టాన్స్‌ను అమలు చేయడం వీలు కాదు అని, అయినా తాము ఆ మహమ్మారితో పోరాటం చేశామన్నారు. చైనా, పాకిస్థాన్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు నేవీ చీఫ్ కరంబీర్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్, చైనా పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనించాలన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జలప్రవేశం చేయనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్