‘నన్ను కొట్టింది బీజేపీ ఎమ్మెల్యేనా లేక మరెవరో తెలియదు’… కోర్టుకు చెప్పిన బాధిత అధికారి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 2019 జూన్ 26న జరిగిన ఘటన సంచలనం రేపింది. ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ధీరేంద్ర తన సిబ్బందితో కలిసి వచ్చారు. అయితే బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ కుమారుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆకాష్ విజయవర్గీయ అందరూ చూస్తుండగా ఆ అధికారిని క్రికెట్ బ్యాట్‌తో పలు మార్లు కొట్టాడు. అక్కడితో ఆగక ఆ అధికారిపై చేయి చేసుకుని ఆయన చెంపపై కూడా కొట్టాడు. ఆ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఆ అధికారిని కొడుతూ అక్కడి నుంచి తరిమారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమే అని హెచ్చరించారు. అవినీతి, గూండాయిజాన్ని అంతం చేస్తామని ఆకాష్ విజయవర్గీయ తెలిపారు. ‘మొరపెట్టుకుంటాం, విన్నపాలు చేస్తాం, వినకపోతే దండనకు దిగుతాం. మా చర్యలు ఇలాగే ఉంటాయి’ అని అన్నారు. మీడియా కెమేరాల్లో రికార్డైన ఈ వీడియోలు నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గీయ తనను కొట్టడంపై బాధిత అధికారి ధీరేంద్ర నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. అయితే శనివారం ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు ఆయన భిన్నంగా స్టేట్మెంట్ ఇచ్చారు. తనను వెనక నుంచి కొట్టిన వ్యక్తి ఎవరో అన్నది తాను చూడలేదని చెప్పారు.
‘సంఘటన సమయంలో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను వెనక్కి తిరిగి చూసే సరికి ఆకాష్ విజయవర్గియా, మరో ఐదుగురు ఉన్నారు. చేతిలో బ్యాట్‌తో ఆకాష్ నిలబడి ఉన్నారు. అయితే, నాపై ఎవరు దాడి చేశారో నేను చూడలేదు’ అని ఇండోర్ కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్లో ధీరేంద్ర పేర్కొన్నారు. ఈ కేసు విచారణను ఈ నెల 25కు కోర్టు వాయిదా వేసింది.
#WATCH Madhya Pradesh: Akash Vijayvargiya, BJP MLA and son of senior BJP leader Kailash Vijayvargiya, thrashes a Municipal Corporation officer with a cricket bat, in Indore. The officers were in the area for an anti-encroachment drive. pic.twitter.com/AG4MfP6xu0
— ANI (@ANI) June 26, 2019
Akash Vijayvargiya, BJP MLA on thrashing a Municipal Corporation officer in Indore: This is just the beginning, we will end this corruption & goondaism. 'Aavedan, nivedan aur fir dana dan' this is our line of action. #MadhyaPradesh pic.twitter.com/xYLqJnpWdZ
— ANI (@ANI) June 26, 2019
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

