లండన్, జూన్ 13: యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్ల లోపు పిల్లలకు హైరిస్క్ సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేయబోతున్నట్టు తెలిపింది. అలాగే 18 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో సెక్సువల్ ఏఐ చాట్బాట్లను వినియోగించకుండా నిబంధనలు పెట్టబోతున్నదని గార్డియన్ వార్తాసంస్థ తెలిపింది.
సోమవారం ఈ నిర్ణయాన్ని స్టార్మర్ ప్రకటిస్తారని.. మంత్రులు ఏయే యాప్స్‌ను బ్యాన్ చేయాలో నిరయిస్తారని గార్డియన్ వెల్లడించింది. ఈ నిబంధనలపై 1,60,000లకు పైగా రిైప్లెలు వచ్చాయని.. ప్రతి 10 మందిలో 9 మంది బ్యాన్ చేయాలని కోరారంటూ రిపోర్టులు చెప్తున్నాయి.