న్యూఢిల్లీ, అక్టోబర్ 1: తెల్లగా ఉంటుంది. చెప్పినట్టు వింటుంది. విసుగన్నదే లేకుండా ఎప్పుడంటే అప్పుడు వండి పెడుతుంది అని ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనామ్.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకొన్నాడు. ‘నువ్వు లేకుండా నా ఇంట్లో బియ్యం ఉడకవు’ అంటూ భావోద్వేగం ప్రకటించాడు. సంప్రదాయ దుస్తులు ధరించి, కుక్కర్‌కు మేలి ముసుగు వేసి.. పెండ్లి ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అయితే, ఈ వింత పెండ్లి నాలుగు నాళ్ల ముచ్చటే అయింది. కుక్కర్ అన్నం వండటం తప్ప ఇంకేం చేయడం లేదంటూ ఖోయిరుల్ నాలుగు రోజులకే రైస్ కుక్కర్‌కు విడాకులిచ్చేశాడు. రైస్ కుక్కర్ అన్నం వండటం కాకుండా ఇంకేం చేయాలో మరి.