IndiGo | క్షమించండి.. ప్రయాణికురాలికి సారీ చెప్పిన ఇండిగో ఎయిర్లైన్స్
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది.
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. అసలు ఇండిగో ఎందుకు సారీ చెప్పిందంటే.. శ్రాంఖ్లా శ్రీవాస్తవ (Shrankhla Srivastava) అనే ప్రయాణికురాలు ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించారు. విమానం దిగిన తర్వాత తన లగేజీ బ్యాగు (సూట్కేసు) చూస్తే పగిలిపోయి ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘డియర్ ఇండిగో.. నా లాగేజీని ఇంత భద్రంగా చూసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ పగుళ్లు పట్టిన సూట్కేసు ఫొటోను షేర్ చేశారు. విమాన సిబ్బంది తన లగేజీ బ్యాగ్ పట్ల వ్యవహరించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇండిగో స్పందించింది.
‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. పొరపాటు ఎక్కడ జరిగిందో చెక్ చేసుకోవడానికి దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి. త్వరలో మళ్లీ మేం మీతో కనెక్ట్ అవుతాం’ అంటూ శ్రీవాస్తవాకు రిప్లే ఇచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టానికి పరిహారం కానీ, పరిష్కారం కానీ చూపిస్తామంటూ హామీ ఇచ్చింది.
Dear @IndiGo6E ,
Thank you for taking care of my luggage 🙂 pic.twitter.com/LdgSHjWA1J— Shrankhla Srivastava (@shrankhla3) March 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

