Master’s Degree Scam | న్యూఢిల్లీ: అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్లే భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ఓ అమెరికన్ యువతి(26) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘నా తరగతిలో 99 శాతం మంది విద్యార్థులు భారతీయులే. అమెరికా వీసా, ఉద్యోగం కోసమే మాస్టర్స్ చేస్తున్నట్టు వారు చెప్తున్నారు.
ఏదో ‘స్కామ్’లో భారతీయ విద్యార్థులు చిక్కుకుంటున్నట్టు అనిపిస్తున్నది. వీరంతా అప్పులు చేసి వస్తున్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతున్నందున వీరికి ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. పైగా క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ ఉన్నప్పుడు భారతీయ విద్యార్థులు గట్టిగా మాట్లాడుకుంటారు’ అంటూ ఆమె రెడిట్‌లో పోస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.