న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కెనడాలో తన రూమ్మేట్ చేతిలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. లంబ్టన్ కాలేజ్లో బిజినెస్ మేనేజ్మెంట్ మొదటి సంవత్సరం చదువుతున్న గురాసిస్ సింగ్(22)ను క్రాస్లే హంటర్(36) అనే వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు.
వీరిద్దరూ సార్నియా నగరంలోని క్వీన్ స్ట్రీట్లో ఒకే ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న కిచెన్లో ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హంటర్.. గురాసిస్ను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఘటనా స్థలంలోనే గురాసిస్ కన్నుమూశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సార్నియా పోలీసులు తెలిపారు.