న్యూఢిల్లీ, జూలై 5: మంచి వేతనంతో కూడిన భారీ ఆఫర్ ప్యాకే జీని పొందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్..ఆ జాబ్ ఆఫర్‌ను దెబ్బతీసింది. మత విశ్వాసాలను కించపరుస్తూ ఆ అభ్యర్థి తన లింక్డ్ఇన్లో చేసిన వ్యాఖ్యల కారణంగానే ఏడాదికి రూ.22 లక్షల ప్యాకేజీతో అతనికి ఇచ్చిన జాబ్ ఆఫర్‌ని రద్దు చేయవలసి వచ్చిందని స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు వెల్లడించారు.
450 ఇంటర్వ్యూలు చేసినా ఎవరూ ఎంపిక కాలేదని తాము రెడిట్‌లో పెట్టిన పోస్టు వైరల్ అయిన తర్వాత ఒక అభ్యర్థి తమకు దరఖాస్తు చేసుకున్నాడని, తన రెస్యూమ్ని జాబీలో సృష్టించి తమ ప్లాట్‌ఫామ్‌ని ఎలా మెరుగుపరచవచ్చో చర్యలు సూచించి ఆ అభ్యర్థి తమను మరింత ఆకట్టుకున్నాడని అన్నారు.