న్యూఢిల్లీ, జూలై 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3కి ఈ నెల 13న ముహూర్తం ఖరారైంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ దీన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని ఈ నెల 19కి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పారు.
చంద్రుడిపై రాకెట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు జూలై 13 అనువుగా ఉన్నదని..ఇది 19 వరకు కొనసాగవచ్చని వెల్లడించారు. చంద్రయాన్ 3 మిషన్‌ను భారతదేశపు అత్యంత బరువైన రాకెట్ జీఎస్ఎల్వీ ఎంకే-3తో నింగిలో ప్రవేశపెట్టనున్నది.