న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కొత్త AC-2 టైర్ ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్మన్ బుష్) కోచ్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రైలు గంటకు180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
“పశ్చిమ మధ్య రైల్వేలోని కోటా డివిజన్ నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్లో 180 కిమీ వేగంతో ఎల్‌హెచ్‌బీ ఏసీ 2 టైర్ కోచ్‌ల ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది” అని మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. ట్రయల్ రన్ సమయంలో స్పీడోమీటర్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో రీడింగ్‌ని చూపించే వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విటర్లో షేర్ చేశారు.
పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యుసీఆర్) సీనియర్ రైల్వే అధికారి ప్రకారం.. కోచ్‌లోని వివిధ అంశాలు యురోపియన్ స్టాండర్డ్‌కు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ఈ ట్రయల్స్ నిర్వహించారు.. కోచ్ డోలనంతో సహా వివిధ అంశాలను పరీక్షించేందుకు రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్వో) ఈ ట్రయల్స్ నిర్వహించింది. పశ్చిమ మధ్య రైల్వేలో భారతీయ రైల్వే 60కిపైగా వివిధ కోచ్‌లు, లోకోమోటివ్ స్పీడ్ ట్రయల్స్‌ను నిర్వహించింది.
नए भारत की नई रफ़्तार!
Trial conducted for 180kmph. pic.twitter.com/g1FHoMYygh— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 11, 2022