న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మదర్స్ డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా రైళ్లలో ప్రత్యేకంగా నవజాత శిశువుల కోసం ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై తల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పిల్లలను పక్కనే పడుకోబెట్టుకునే వీలుకలుగనున్నది. ఇప్పటి వరకు రైలులో ప్రయాణించే తల్లుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి అందుబాటులో లేవు. భారతీయ రైళ్లలో బాలింతలు, చంటి పిల్లల తల్లులు ఎంతో మంది నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. బెర్త్ సరిపోకపోవడంతో తల్లులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే రైల్వేశాఖ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లక్నో – ఢిల్లీ మార్గంలో నడిచే లక్నో మెయిల్లో రెండు బెర్తులను ఏర్పాటు చేశారు. అయితే, బేబీ బెర్త్ కోసం ప్రత్యేకంగా రైల్వే ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. కొత్త సదుపాయం ప్రవేశపెట్టిన తర్వాత పాలు తాగే శిశువులతో ప్రయాణించే మహిళలు సాఫీగా ప్రయాణం చేస్తారని రైల్వేశాఖ ట్వీట్ చేసింది. లక్నో మెయిల్లోని త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రెండు బెర్త్‌లతో పాటు బేబీ బెర్త్‌ను ప్రవేశపెట్టినట్లు రైల్వేశాఖ ట్వీట్లో ‘బేబీ బెర్త్’ ఫొటోను షేర్ చేసింది.
త్వరలోనే బేబీ బెర్త్ సదుపాయాన్ని ఇతర రైళ్లలోను వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా లక్నో డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ బేబీ బెర్త్‌ను రైలు లోయర్ బెర్త్‌లో ఏర్పాటు చేశామని, అవసరం లేని సమయంలో బెర్త్‌ను కిందికి మడతపెట్టవచ్చని పేర్కొన్నారు. బెర్త్‌ను ఏర్పాటు చేసుకోవడం సులభమని చెప్పారు. 770 మిల్లీమీటర్ల పొడవు, 255 మిల్లీమీటర్ల వెడల్పు, 76.2 మిల్లీమీటర్ల ఎత్తు ఉండే.. ఈ బేబీ బెర్త్‌కు.. బెర్త్పైనున్న శిశువు సురక్షితంగా ఉండేలా పట్టీలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
It's great if @RailMinIndia do this @AshwiniVaishnaw this will help mother&baby both. Recently we traveled to #Pune #Nagpur with our 1yr daughter & my wife could not sleep. Foldable #babyberth will be boon for both to have nice sleep. @narendramodi @DarshanaJardosh @drmpune pic.twitter.com/gTZw7rCvvi
— Manoj Pochat (@Manojpochat) May 10, 2022