Indian Railway | రైల్వేశాఖ ప్రయాణికులకు స్వల్ప ఊరట కల్పించింది. ప్రీమియం రైళ్లలో ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవాపన్ను (Service Tax) ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో ఇకపై ప్రయాణికులు రన్నింగ్ ట్రైన్లో టీ అయినా.. కాఫీ అయినా కేవలం రూ.20 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇంతకు మునుపు ముందస్తుగా టీ, కాఫీ బుక్ చేసుకోని ప్రయాణికుల నుంచి అదనంగా రూ.50 సర్వీస్‌చార్జి వసూలు చేసేవారు. దీంతో మొత్తం కలిపి టీ, కాఫీకి రూ.70 చెల్లించాల్సి వచ్చేది.
ఇటీవల సర్వీసు ఛార్జీకి సంబంధించిన బిల్లులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో కేటరింగ్ సర్వీసులను టిక్కెట్‌తో పాటు బుక్ చేసుకోని ప్రయాణికులకు ఈ కొత్త ఆర్డర్ కిందనే ఛార్జీలు విధించాలని రైల్వే బోర్డు పేర్కొంది. ఇదే సమయంలో మిగతా ఫుడ్ ఐటమ్స్‌కు రూ.50 సర్వీస్ చార్జి కొనసాగుతుందంటూ ఉత్తర్వులతో పాటు ఆహార పదార్థాలకు సంబంధించిన చార్ట్‌ను కూడా రైల్వే బోర్డు విడుదల చేసింది. ప్రీమియం రైళ్లలో శతాబ్ది, రాజధాని, వందే భారత్, తేజస్, దురంతో ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.