న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. (Pahalgam Terror Attack) బుధవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన భౌతికకాయం చేరింది. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భర్త వినయ్ నర్వాల్ పార్థీవ దేహాన్ని హత్తుకుని ఓదార్చలేనంతగా భార్య ఏడ్చింది. అనంతరం ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం హర్యానాలోని కర్నాల్‌లో స్వగ్రామానికి తరలించారు. ఈ నేపథ్యంలో భర్తకు భావోద్వేగంతో భార్య వీడ్కోలు పలికింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల కిందట భారత నౌకాదళంలో చేరారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో పని చేసే అధికారిగా సహచరులు, ఉన్నతాధికారుల నుంచి ఆయన మన్ననలు పొందారు. ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్‌కు పెళ్లి జరిగింది. 19న రిసెప్షన్ తర్వాత హనీమూన్ కోసం ఈ జంట జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. 22న జరిగిన ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీలతో సహా 28 మంది మరణించగా మరికొందరు గాయపడ్డారు.
#WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal’s wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attack
The couple got married on April 16. https://t.co/KJpLEeyxfJ
— ANI (@ANI) April 23, 2025