న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఇప్పటికే నానో లిక్విడ్ యూరియాను ప్రవేశపెట్టిన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) త్వరలోనే నానో డీఏపీ ఎరువును సైతం మార్కెట్లోకి తేనుంది. రూరల్ వాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ యూఎస్ అశ్వతి ఈ వివరాలు వెల్లడించారు.
500 మిల్లీలీటర్ బాటిల్ ధరను రూ.600గా నిర్ణయించినట్టు చెప్పారు. దీనిని మార్కెట్లోకి విడుదల చేయడానికి ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేశామని, వచ్చే నెలాఖరుకు అనుమతి రావొచ్చన్నారు. ఒక బస్తా డీఏపీకి 500 మిల్లీలీటరు నానో డీఏపీ బాటిల్ సమానమని చెప్పారు. బస్తా డీఏపీ ఎరువు ధర రూ.1350 ఉండగా, నానో డీఏపీ రూ.600కే లభిస్తుందన్నారు.