తాలిబన్ నేతతో భారత రాయబారి చర్చలు..

దోహ: ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించేసిన తాలిబన్లతో ఇవాళ భారత్ చర్చలు జరిపింది. దోహలో తాలిబన్ల నేతతో భారత రాయబారి మాట్లాడారు. ఉగ్రవాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆఫ్ఘన్ భూభాగంలో ఉగ్రవాదుల కదలికలు ఆందోళనలు కలిగిస్తున్నట్లు భారత రాయబారి వెల్లడించారు. ఖతార్ రాయబారి దీపక్ మిట్టల్.. తాలిబన్ల పొలిటికల్ ఆఫీసు అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్తో ఇవాళ సంప్రదింపులు జరిపారు. దోహలో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఈ మీటింగ్ జరిగింది. తాలిబన్ల అభ్యర్థన మేరకు ఈ భేటీ జరిగినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడైంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, భద్రత అంశం గురించి తాలిబన్ నేతతో దీపక్ చర్చించారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి మాట్లాడారు. భారత్‌కు రావాలనుకుంటున్న ఆఫ్ఘన్ మైనార్టీల అంశం గురించి కూడా వారిద్దరూ చర్చించారు. ఆఫ్ఘన్ భూభాగాన్ని భారత వ్యతిరేక చర్యలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకూడదని దీపక్ మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ సమస్యలన్నింటికీ సానుకూలంగా స్పందించనున్నట్లు తాలిబన్ ప్రతినిధి తెలిపారు.
మరో వైపు ఆఫ్ఘన్ సమస్య గురించి చర్చించేందుకు అత్యున్నత బృందాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

