ఖాట్మాండు: భారతీయ పర్వతారోహకుడు సుబ్రతా ఘోష్.. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం(:Mount Everest)పై ప్రాణాలు విడిచాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. కిందకు దిగుతున్న సమయంలో అతను మరణించాడు. 45 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి బెంగాల్ లో టీచర్‌గా చేస్తున్నాడు. 8849 మీటర్ల ఎత్తైన ఎవరెస్టు ఎక్కిన తర్వాత కిందకు దిగుతున్న సమయంలో హిల్లరీ స్టెప్ వద్ద అతను ప్రాణాలు కోల్పోయాడు. హిల్లరీ స్టెప్ ప్రాంతం డెత్ జోన్లో ఉన్నది. 8వేల మీటర్ల ఎత్తు నుంచి ఎవరెస్ట్‌పై డెత్ జోన్‌గా పరిగణిస్తారు. అక్కడ సహజమైన ఆక్సిజన్ అందుబాటలో ఉండనున్నది.
సుబ్రతా ఘోష్ తో పాటు పిలప్పీన్స్కు చెందిన 45 ఏళ్ల పిలిప్ శాంటియాగో సౌత్ కల్నల్ వద్ద ప్రాణాలు కోల్పోయాడు. అతను ఎవరెస్ట్‌ను ఎక్కే సమయంలో మరణించినట్లు టూరిజం శాఖ ప్రతినిధి హిమాల్ గౌతమ్ తెలిపారు. ఫోర్త్ హై క్యాంప్ చేరుకున్న తర్వాత అక్కడ టెంట్లో రెస్టు తీసుకుంటూనే తుది శ్వాస విడిచాడు.
నేపాల్ ప్రభుత్వం ఈసారి ఎవరెస్ట్ అధిరోహణకు 459 మందికి పర్మిట్లు జారీ చేసింది. ఇప్పటికే వంద మందికిపై పర్వతారోహకులు, గైడ్లు..పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన వందేళ్లలో మౌంట్ ఎవరెస్ట్‌పై 345 మంది మరణించారు.