శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో శత్రు మూకల దురాక్రమణను అడ్డుకోవడానికి అణునిత్యం కాపాలా ఉండే జవాన్లు (Indian Army) దీపావళి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో (Poonch Sector) జరిగిన దీపావళి (Deepawali) వేడుకల్లో ఆర్మీ అధికారులు, జవాన్లు పాల్గొన్నారు. భక్తి పాటలు, భజనలు చేశారు. పూజల అనంతరం అందరికీ హారతి ఇచ్చారు. అనంతరం స్వీట్లు పంచుకుని పటాకులు కాల్చి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
#WATCH | J&K: Indian Army officials in Poonch celebrate Deepawali pic.twitter.com/mF6AQ03ia9
— ANI (@ANI) November 10, 2023