న్యూఢిల్లీ: ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) ప్రధాన యుద్ధ విమానంగా పనిచేసిన మిగ్-21 జెట్లకు రాజస్థాన్‌కు చెందిన బికనేర్‌లోని నల్ ఎయిర్ బేస్‌లో చివరి ప్రయాణం ముగిసింది. చండీగఢ్‌లో మంగళవారం మిగ్-21కు లాంఛనంగా ఐఏఎఫ్ వీడ్కోలు పలకనున్నది.
మిగ్-21 యుద్ధ విమానాలు ఇక ఐఏఎఫ్ అమ్ములపొది నుంచి వైదొలగనున్నాయి. మిగ్-21 గౌరవార్థం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సోమవారం ఒంటరిగా మిగ్-21లో ప్రయాణించి భావోద్వేగానికి లోనయ్యారు.