న్యూఢిల్లీ, మార్చి 29: 2016-2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 2.76 లక్షల అల్లర్లు జరిగాయని, ఇందులో 3,399 ఘటనలు మతపరమైన ఘర్షణలేనని మంగళవారం కేంద్రం లోక్సభకు తెలియజేసింది. దేశంలో జరుగుతున్న అల్లర్లు, మూకహత్యలపై వివరాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్ జోషి కేంద్రాన్ని కోరారు. దీంతో హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ వివరాలు వెల్లడించారు.
