Foreign Ministry | అమెరికా, రష్యా మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్వాగతించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ చొరవ ప్రపంచ శాంతి దిశగా ఒక ముందడని పేర్కొన్నారు. ఈ చర్చల సందర్భంగా సాధించిన పురోగతిని భారతదేశం అభినందిస్తున్నదని తెలిపింది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు సాగగలదని విశ్వసిస్తుందని జైస్వాల్ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ యుద్ధం వైపు చూస్తోందని, ఈ వివాదం వీలైనంత త్వరగా ముగియాలని అందరూ కోరుకుంటున్నారని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని భారత్ ఎల్లప్పుడూ విధానంగా ఉందని జైస్వాల్ స్పష్టం చేశారు.
సంభాషణ, పరస్పర అవగాహన శాంతికి అతిపెద్ద మార్గమని పునరుద్ఘాటించారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇద్దరు నాయకులు నేరుగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ ఈ సమావేశాన్ని ‘ఉపయోగకరమైనది’ అని అభివర్ణించినప్పటికీ.. ప్రస్తుతానికి ఎలాంటి కీలకమైన ఒప్పందం కుదరలేదని ఆయన స్పష్టం చేశారు. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, కానీ ఇంకా మా గమ్యస్థానానికి చేరుకోలేదని అన్నారు. అంచనాలు, అసంపూర్ణ ఫలితాలు ట్రంప్ ఈ చర్చలను ‘చాలా సానుకూలమైనవి’గా పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నాటో నాయకులతో తదుపరి దశలను చర్చిస్తానని కూడా చెప్పారు. ట్రంప్ ‘స్నేహపూర్వక’ చర్చలు.. రష్యా జాతీయ ప్రయోజనాలను అర్థం చేసుకున్నందుకు పుతిన్ ప్రశంసించారు. అయితే, చర్చలపై ఎలాంటి నిర్దిష్ట ప్రకటన, ఒప్పందం జరిగినట్లుగా బయటకు రాలేదు. అనేక అంశాలపై విభేదాల పరిష్కరానాకి మరిన్ని చర్చలు అవసరమని అంగీకరించారు. చర్చల తర్వాత, రష్యా చమురు కొనుగోలు కోసం చైనాపై సుంకాలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, భారత్‌పై విధించిన సుంకాలపై మాత్రం స్పందించారు. అమెరికా ఇప్పటికే భారత్‌పై 50శాతం సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకే జరిమానా 25శాతం సుంకాలు జరిమానాగా విధించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్‌ను ప్రశంసించారు. చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. ట్రంప్ రష్యా జాతీయ ప్రయోజనాలను అర్థం చేసుకున్నారని, గౌరవించారన్నారు.