Surrogate Ads | న్యూఢిల్లీ: మద్యానికి సంబంధించి సెలబ్రిటీల ఎండార్స్మెంట్లపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైనట్టు ‘రాయిటర్స్’ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం మద్యం ప్రత్యక్ష ప్రకటనలపై నిషేధం ఉంది. దీంతో ఆయా కంపెనీలు బాలీవుడ్ నటులు నటించిన సరోగేట్ యాడ్స్ ద్వారా తమ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.
ఆయా మద్యం బ్రాండ్లను నేరుగా ప్రచారం చేయకుండా ఆ ప్రకటన చూడగానే ఆ బ్రాండ్ మద్యం గుర్తు వచ్చేలా చేయడాన్నే సరోగేట్ యాడ్స్ అంటారు. ఇవి ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కేంద్రం భావిస్తున్నది.