WEF | భారత్‌లో మహిళలు.. విద్యలో మెరుగు రాజకీయాల్లో వెనకడుగు: డబ్ల్యూఈఎఫ్
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచీలో భారత్ ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 129వ స్థానంలో నిలిచింది.
- భారత్‌లో మహిళల పరిస్థితిపై డబ్ల్యూఈఎఫ్ అభిప్రాయం
- ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో రెండు స్థానాలు కిందకు
WEF | న్యూఢిల్లీ, జూన్ 12: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచీలో భారత్ ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 129వ స్థానంలో నిలిచింది. 146 దేశాల జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానం దక్కించుకోగా, సూడాన్ చివరి స్థానంలో నిలిచింది. ఆదాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య తదితర అంశాలపై అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఐస్‌ల్యాండ్ 93.5%, భారత్ 64.1% స్కోర్ సాధించాయి. ప్రపంచం మొత్తంగా 68.5 శాతం స్కోరు సాధించిందని, పూర్తి లింగ సమానత్వం సాధించేందుకు మరో 134 ఏండ్లు లేదా ఐదు తరాలు పడుతుందని డబ్ల్యూఈఎఫ్ నివేదిక అభిప్రాయపడింది. దక్షిణాసియా దేశాల వరకు చూస్తే లింగ వ్యత్యాస సూచీలో భారత్ కంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ ముందు స్థానాల్లో ఉండటం గమనార్హం. ఇక పాకిస్థాన్ చివరి నుంచి రెండవ(145వ) స్థానంలో ఉన్నది.
ఆర్థిక లింగ సమానత్వం తక్కువ ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్థాన్, మొరాకో సహా భారత్ కూడా ఉన్నది. అయితే ఈ స్కోర్ గత నాలుగేండ్లుగా స్వల్పంగా పెరుగుతున్నదని నివేదిక తెలిపింది. అయితే సెకండరీ విద్యలో భారత్ మెరుగైన లింగ సమానత్వం చూపిందని పేర్కొన్నది. మహిళల రాజకీయ సాధికారత విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉన్న విషయాన్ని నివేదిక ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మంత్రి పదవుల్లో కేవలం 6.9 శాతం, పార్లమెంట్లో 17.2 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపింది. మహిళల రాజకీయ సాధికారత విషయంలో భారత్ ప్రపంచంలో 65 ర్యాం కులో ఉన్నదని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

