sugar exports | చక్కెర ఎగుమతులపై నిషేధంతో ధరల మంటకు చెక్..!
ధరల మంటకు చెక్ పెట్టేందుకు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను (sugar exports) భారత్ నిషేధించనుంది.
న్యూఢిల్లీ : ధరల మంటకు చెక్ పెట్టేందుకు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను (sugar exports) భారత్ నిషేధించనుంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈసారి చెరకు దిగుబడి తగ్గనుండటంతో ధరలకు రెక్కలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక సహా చెరకు సాగయ్యే ప్రాంతాల్లో సగటు వర్షపాతం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
ఏడేండ్ల తర్వాత భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తోంది. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టస్ధాయిలో 7.4 శాతానికి ఎగబాకడం, ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరడంతో భారత్ చెరకు ఎగుమతులపై బ్యాన్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోందని చెబుతున్నారు.
మూడేండ్ల గరిష్టస్ధాయిలో ద్రవ్యోల్బణం పెరగడంతో ఆహారోత్పత్తుల ధరలకు చెక్ పెట్టేందుకు ఎగుమతులపై నిషేధం అనివార్యమని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక 2023-24 సీజన్లో చెరకు దిగుబడి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచనా.
Read More :
Chandrayaan 3 | జాబిల్లిపై అడుగుపెట్టాం..చంద్రయాన్-3 సక్సెస్‌పై ఇస్రో చీఫ్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ban
- India
- inflation
- sugar exports
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

