Chandrayaan 3 | జాబిల్లిపై అడుగుపెట్టాం..చంద్రయాన్-3 సక్సెస్‌పై ఇస్రో చీఫ్
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan 3) బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
న్యూఢిల్లీ : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan 3) బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. గంటల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ మూన్ మిషన్ సక్సెస్ కావడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగితేలింది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం బెంగళూర్‌లోని మిషన్ కంట్రోల్ క్యాంపస్ వేదికగా శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాధ్ మాట్లాడారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారత్ ఇప్పుడు చంద్రుడిపై కాలుమోపిందని ప్రకటించారు. ఇక మూన్ మిషన్ విజయవంతం కావడంతో భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది (Chandrayaan 3 Sucess). బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది.
దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.
Read More :
Chandrayaan-3 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై శాస్త్రవేత్తలకు ఎందుకంత ఇంట్రెస్ట్.. అక్కడ అంత విలువైనది ఏముంది?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

