Chandrayaan-3 | చంద్రుడి దక్షిణ ధ్రువంపై శాస్త్రవేత్తలకు ఎందుకంత ఇంట్రెస్ట్.. అక్కడ అంత విలువైనది ఏముంది?
చంద్రుడి గురించి తెలుసుకునేందుకు అమెరికా, యూరప్, చైనా, భారత్, జపాన్, ఇజ్రాయెల్.. తదితర దేశాలు అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేశాయి. అయినప్పటికీ చంద్రుడు ఎప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోతున్నాడని, తెలియని విషయలు ఎన్నో ఉన్నాయని ‘విజ్ఞాన్ ప్రసార్' సైంటిస్ట్ డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ చెప్పారు.
Chandrayaan-3 | న్యూఢిల్లీ: చంద్రుడి గురించి తెలుసుకునేందుకు అమెరికా, యూరప్, చైనా, భారత్, జపాన్, ఇజ్రాయెల్.. తదితర దేశాలు అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేశాయి. అయినప్పటికీ చంద్రుడు ఎప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోతున్నాడని, తెలియని విషయలు ఎన్నో ఉన్నాయని ‘విజ్ఞాన్ ప్రసార్’ సైంటిస్ట్ డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువం.. అంతుబట్టని రహస్యాల నిలయమని, ఇక్కడ మానవుడి చేయాల్సిన అన్వేషణ ఎంతో ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..

Vigyan Prasar Scientist Tv
చంద్రుడు పరిణామం గురించి?
చంద్రుడి వయసు సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు. వయసులో భూగ్రహం కన్నా చంద్రుడు 6 కోట్ల సంవత్సరాలు చిన్నవాడు.
చంద్రుడిపై ద్రవ్యరాశి తక్కువ.. ఎందుకు?
భూమి గురుత్వాకర్షణ కంటే చంద్రుడి గురుత్వాకర్షణ చాలా తక్కువ. అందుకే వస్తువల బరువు భూమిపై కంటే చంద్రుడిపై తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు భూమిపై ఓ వ్యక్తి బరువు 66 కిలోలు ఉంటే.. చంద్రుడిపై కేవలం 11 కిలోలు మాత్రమే ఉంటాడు.
దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
చంద్రుడి దక్షిణ ధ్రువం గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది చాలా తక్కువ. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నాటి ‘వాటర్ ఐస్’ ఇక్కడ ఉందని అంచనా. ఇది మానవసహిత అంతరిక్ష యాత్రలకు ‘ఇంధనం’గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
వాటర్ ఐస్ అంత కీలకమా?
భూమిని దాటి మరో గ్రహాన్ని అందుకోవాలంటే.. చంద్రుడుపైన ఆగి వెళ్లాలని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇక్కడ లభ్యమయ్యే ‘వాటర్ ఐస్’ నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ను విడగొట్టొచ్చు. అప్పుడు వ్యోమగాములకు ప్రాణవాయువు, ఇంధనం రెండూ లభిస్తాయి.
దక్షిణ ధ్రువంపై శాశ్వత నీడ.. ఎందుకు?
అక్కడి భౌగోళిక పరిస్థితులే అందుకు కారణం. చంద్రుడి అక్షం కాస్త వంగి ఉంటుంది. ఫలితంగా ధ్రువాల వద్ద కొన్ని ప్రాంతాలు శాశ్వత నీడలో ఉండిపోయాయి. దీని వల్ల ఇక్కడ అత్యంత శీతల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కోట్ల సంవత్సరాలుగా నీరు మంచురూపంలో నిల్వ ఉన్నది.
చంద్రయాన్-1 ఏం కనుగొన్నది?
దక్షిణ ధ్రువంలో నీరు మంచురూపంలో ఉందని ‘లూనార్ మిషన్లు’ కచ్చితమైన సమాచారం ఇచ్చాయి. అందులో చంద్రయాన్-1 ఒకటి. దీని డాటా ఆధారంగానే ‘చంద్రయాన్-3’ చేపట్టారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

