Hottest India | దేశంలో భానుడి విశ్వరూపం.. ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల్లో 19 మనవే..!
Hottest India | భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పంచవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు భారత్ కేంద్రంగా మారింది. ఏప్రిల్ 21న AQI.in విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితాను పరిశీలిస్తే అందులో 19 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.
Hottest India : భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పంచవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు భారత్ కేంద్రంగా మారింది. ఏప్రిల్ 21న AQI.in విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితాను పరిశీలిస్తే అందులో 19 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.
బీహార్‌లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నగరాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. వీటితోపాటు బీహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్లతోపాటు పశ్చిమబెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం నేపాల్‌లోని లుంబిని కావడం గమనార్హం.
మరోవైపు ఏప్రిల్ 22 నుంచి 24 వరకు దేశంలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే దానిని వడగాల్పుగా పరిగణిస్తారు. వాతావరణ నిపుణుల ప్రకారం ఈ తీవ్రమైన వేడికి పలు కారణాలు ఉన్నాయి. నిర్మలమైన ఆకాశం కారణంగా సూర్యరశ్మి నేరుగా భూమిని తాకడం, హిమాలయాల్లో మంచు కవచం తగ్గడం, వాయవ్య దిశ నుంచి పొడి గాలులు వీయడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా దేశంలో అధిక ఉష్ణోగ్రతలు దోహదం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. రాబోయే వారాల్లో కూడా వేడి తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

