Coronavirus | 24 గంటల్లో 529 కొత్త కేసులు.. మూడు మరణాలు
Coronavirus | భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 500కు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి.
Coronavirus | భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 500కు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,093గా ఉంది.
ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,33,340కి ఎగబాకింది. ఇప్పటి వరకూ కొవిడ్ నుంచి 4.4 కోట్ల మంది (4,44,72,756) కోలుకున్నారు.
ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
109కి పెరిగిన జేఎన్.1 వేరియంట్ కేసులు..
మరోవైపు దేశంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) చాపకింద నీరులా పాకుతోంది. 24 గంటల్లో 40 జేఎన్.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. దీంతో డిసెంబర్ 26వ తేదీ వరకుఈ కొత్త వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా మొత్తం 109కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందులో అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 జేఎన్.1 కేసులు బయటపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Coronavirus | డేంజర్ బెల్స్.. 109కి పెరిగిన జేఎన్.1 వేరియంట్ కేసులు
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయం నిర్మాణానికి యాచకుల భారీ విరాళం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

