న్యూఢిల్లీ: తుర్కియే, అజర్ బైజాన్‌కు భారతీయుల వీసా దరఖాస్తులు 42 శాతం తగ్గాయి. ఇటీవల భారత్-పాక్ సైనిక ఘర్షణలో ఈ రెండు దేశాలు పాక్ పక్షాన నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు ఆ రెండు దేశాల సందర్శనకు గుడ్ బై చెప్పేస్తున్నారు.
వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అట్లీస్ నివేదిక ప్రకారం కేవలం 36 గంటల్లో దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను మధ్యలోనే ఉపసంహరించుకోవడం 60 శాతం పెరిగింది. ఇదే సమయంలో వియత్నాం, థాయ్‌లాండ్, ఈజిప్ట్‌ల సందర్శనకు వీసా దరఖాస్తులు 31 శాతం పెరిగాయి.