Home
National
India Including Kashmir Is A Secular Place But It Is A Different Thing That It Is Being Made Godses Nation Now Pdp Chief Mehbooba Mufti
కశ్మీర్ సహా భారత్ లౌకిక దేశమే.. కానీ ఇప్పుడు గాడ్సే దేశంగా మారుతున్నది
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా డాంగ్రీలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం ఉగ్రవాదులు పెట్టిన
- బీజేపీని ఉద్దేశించి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విమర్శలు
- రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలపై ఆగ్రహం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా డాంగ్రీలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం ఉగ్రవాదులు పెట్టిన మందుపాతర పేలి ఒక చిన్నారి మరణించింది. ఈ ఘటనలపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవి గుండెలను పిండేసే ఘటనలని వ్యాఖ్యానించారు.
మృతుల కుటుంబసభ్యులకు తీరని నష్టం జరిగిందని ముఫ్తీ పేర్కొన్నారు. భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం ఒక వర్గానికి అలవాటుగా మారిందని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వర్గం దేశంలో విద్వేషాలను పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు. కశ్మీర్ సహా భారత్ పూర్తిగా లౌకిక దేశమేనని, అయితే ఇప్పుడు కొందరి వల్ల భారత్ గాడ్సే దేశంలా మారుతున్నదని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

