India ships | భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ నౌకలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
India ships | భారత నౌకాదళ (Indian Navy) శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ముందడుగు వేశారు. కోల్‌కతా (Kolkata) లోని శ్యామప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherji) పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
India ships : భారత నౌకాదళ (Indian Navy) శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ముందడుగు వేశారు. కోల్‌కతా (Kolkata) లోని శ్యామప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherji) పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. స్టెల్త్ యుద్ధ నౌక ‘దూనగిరి’, భారీ సర్వే నౌక ‘సంశోధక్’, జలాంతర్గామి విధ్వంసక నౌక ‘అగ్రే’ లను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూడు నౌకలు యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక కార్యకలాపాల్లో నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రక్షణ రంగంలో భారత్ ఇకపై కేవలం కొనుగోలుదారుగా మిగిలిపోదని, మన సైనిక శక్తి ప్రపంచానికి మార్కెట్‌గా మారకూడదని అన్నారు. మన బలానికి నిర్వచనం ప్రపంచానికి మార్కెట్‌గా మారడంలో లేదని మన స్వావలంబనలోనే ఉందని చెప్పారు. ఈ మూడు నౌకలు భారత పరిశ్రమల ప్రతిభకు, ఇంజనీర్ల నైపుణ్యానికి, కార్మికుల కఠోర శ్రమకు నిదర్శనమని, ఇదే నవ భారతానికి ఉన్న అతిపెద్ద బలమని ప్రధాని అన్నారు.
కొన్నేళ్ల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసినప్పుడు సముద్ర శక్తిలో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం కొత్త యుద్ధ నౌకలది మాత్రమే కాదని, పెరుగుతున్న భారత స్వావలంబన ప్రయాణం అని ఆయన అభివర్ణించారు. ఏ దేశానికైతే బలమైన సముద్ర శక్తి ఉంటుందో, ఆ దేశానికి బలమైన ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం ఉంటుందని, ఈ వాస్తవాన్ని భారత్ బాగా అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోందని మోదీ తెలిపారు.
దూనగిరి పేరుగల నౌక అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ వంటి శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సార్లతో దీన్ని తీర్చిదిద్దారు. సుదీర్ఘ సముద్ర కార్యకలాపాలకు అనువుగా, బహుముఖ ఆధిపత్యం ప్రదర్శించేలా దీనిని రూపొందించారు. సంశోధక్ నౌక ఒక భారీ సర్వే నౌక. తీరప్రాంత, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి, రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అటానమస్ అండర్‌వాటర్ వెహికల్స్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ వంటి అధునాతన వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
ఇక అగ్రే అనే నౌక అర్నాల తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేసేందుకు దీన్ని రూపొందించారు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు దీని ప్రత్యేకతలు. ఈ నౌకల ప్రారంభ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి, భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

