న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా(Syria) నుంచి సుమారు 75 మంది భారతీయుల్ని సురక్షితంగా తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాయుధ పోరాటం చేపట్టిన రెబల్స్… బాషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చిన విషయం తెలిసిందే. ప్రాణ భయంతో అసద్.. విదేశాలకు పారిపోయారు. ఆయనకు రష్యా ఆశ్రయం కల్పిస్తున్నది. సిరియా నుంచి లెబనాన్‌కి వెళ్లిన భారతీయులు.. అక్కడ నుంచి క్షేమంగా భారత్‌కు తిరిగి వస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. సిరియాలో చిక్కుకున్న వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన 44 మంది జైరీన్ యాత్రికులు ఉన్నారు. సైదా జైనబ్ వద్ద వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు భారతీయులు సిరియాలోనే ఉండిపోయారు. వాళ్లు డమస్కస్‌లో ఉన్న ఎంబసీతో టచ్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అసద్ కుటుంబం సుమారు అయిదు దశాబ్ధాల నుంచి సిరియాను పాలిస్తున్నది. అయితే రెబల్స్ తిరుగుబాటుతో.. ఆదివారం దేశాన్ని విడిచి వెళ్లారు.