న్యూఢిల్లీ, నవంబర్ 19: టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన ఒక సరుకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో హైజాక్ చేశారు. 50 మంది నావికా సిబ్బందితో వస్తున్న ఈ నౌకలో ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలకు చెందిన వారున్నారు. అయితే ఇందులో భారతీయులు ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. బ్రిటిష్ కంపెనీకి చెందిన ఈ నౌకను జపాన్‌కు చెందిన కంపెనీ నిర్వహణా బాధ్యతలు చూస్తున్నది. ఈ హైజాక్‌ను ఇజ్రాయెల్ దేశం తీవ్రంగా ఖండించింది. కాగా, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఎర్ర సముద్రదంలో ఇజ్రాయెల్ సంబంధిత నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపనంత వరకు తాము కూడా నౌకలపై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హౌతీలు స్పష్టం చేశారు.