జమ్ము: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ములో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని అధికారులు వెల్లడించారు. 2019 ఆగస్టు 5 నుంచి 2023 జూన్ 16 మధ్య 231 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 2019 ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు తర్వాత జమ్ములో 8 గ్రనేడ్ దాడులు, 13 ఐఈడీ దాడులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఐఈడీ దాడుల్లో 2015-19 మధ్య ముగ్గురు చనిపోగా, 2019-23 మధ్య 11 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.